అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు.. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

న్యూస్‌రీల్‌

అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్‌ జిల్లా కూడా నిలిచింది.

ములుగు ఎందుకు ప్రత్యేకమంటే..

ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్‌ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ గణనీయం

అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలు

ఉమ్మడిజిల్లాకు గ్రీన్‌ కవచం ములుగు అటవీ సంపద

మూడు జిల్లాలకు పర్యావరణ గండం

పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం

ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు,

వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి.

– డాక్టర్‌ కె.పురుషోత్తం, రిటైర్డ్‌ డీఎఫ్‌ఓ, పర్యావరణ నిపుణుడు

హనుమకొండ

ములుగు

మహబూబాబాద్‌

జనగామ

వరంగల్‌

భూపాలపల్లి

భౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ)

అటవీ విస్తీర్ణం (చ.కి.మీ)

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ హరివెంకటరామ ప్రసాద్‌, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకృష్ణప్రసాద్‌, దాతలు తొట్రెడ్డి హృదయ్‌కుమార్‌రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్‌, పుప్పాల శివశంకర్‌, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్‌కుమార్‌, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పూర్ణచందర్‌, మోతుకూరి మయూరి రాజేశ్వర్‌రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్‌, ఆంజనేయులు, శ్రీధర్‌రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అయితా గోపీనాథ్‌ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement