నర్మెట: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గోపగోని శ్రీధర్‌గౌడ్, ప్రిన్సిపాల్ పుష్పకుమారి అన్నారు. స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలను బుధవారం అందించారు. ఇంగ్లిష్ మీడియం విద్య, అల్పాహారం, భోజనం, దుస్తులతో పాటు పలు వసతులను ప్రభుత్వం కల్పించిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఏపీ చైర్‌పర్సన్ రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం తెలంగాణ రైజింగ్‌లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ లిటరసీ కృత్రిమ మేథా అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ డాక్టర్ ఆకుల వెంకటవంశీకృష్ణ కృత్రిమ మేథా ఆవశ్యకతను వివరించి ప్రయోగాత్మకంగా సాధన చే యించారు. బి.ఎన్. సురేఖ, అనగాని శ్రీని వాస్, సంగం సంధ్య పాల్గొన్నారు.
ఫిట్‌నెస్ లేని వాహనాల సీజ్
జనగామ రూరల్: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపధ్యంలో పట్టణంలో ప్రైవేట్ స్కూల్ వాహనాలను డీటీఓ ఎంఆర్ శిల్ప బుధవారం తనిఖీలు చేశారు. ఫిట్‌నెస్, ట్యాక్స్ లేని ఆరు వాహనాలను సీజ్ చేశారు. 11 కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని ప్రమాణాలు పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఏ శ్వేత, నవిత తదితరులు పాల్గొన్నారు.
నర్మెట(తరిగొప్పుల): క్రమశిక్షణ, నిజాయితీ, సమయపాలనతో పాటు ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని వెస్ట్‌జోన్ డీసీసీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. రికార్డులు, స్టేషన్ ప్రాంగణం, రిసెప్షన్, రికార్డుల గదులు, సీసీటీఎన్‌ఎస్ పని ప్రదేశాలను, ఆన్‌లైన్ పురోగతి, యూఐ కేసులు, పెండింగ్ కేసుల రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఐ ముసుకు అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, సిబ్బంది ఉన్నారు.


