ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు..

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

లింగాలఘణపురం: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. బుధవారం లింగాలఘణపురం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆ కస్మిక తనిఖీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్‌లో తహసీల్దార్‌ అండాలు వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఆరా తీశారు. రిజిస్ట్రేషన్‌ గది ప్రజలకు సౌకర్యంగా సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని, రికార్డులు క్రమపద్ధతిలో అమర్చాలని, జీపీఓలు, ఆర్‌ఐ కూర్చునే గదులను కూడా పరిశీలించి బీరువాలు ఒకేచోట అమర్చితే గదులు సరిపోతాయన్నారు. ప్రజలు కింద కూర్చోకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకు వెళ్లాలన్నారు. గణితం ప్రశ్నలు వేసి తానే స్వయంగా వివరించారు. ఆయనతో పాటు జీసీడీఓ గౌసియాబేగం, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement