పాఠశాలలు, కళాశాలల్లో ప్రాపర్టీ ట్యాక్స్‌ కొలతలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలు, కళాశాలల్లో ప్రాపర్టీ ట్యాక్స్‌ కొలతలు

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

జనగామ: పట్టణంలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ప్రాపర్టీ ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌ కోసం మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొలతలు తీసుకునే ప్రక్రియ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల భవనాల విస్తీర్ణాన్ని నిబంధనల ప్రకారం వెరిఫై చేసి, ప్రాపర్టీ ట్యాక్స్‌ నిర్ధారణ కోసం అధికారులు కొలతలు నమోదు చేశారు. కమిషనర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. పట్టణంలోని అన్ని విద్యాసంస్థల్లో పారదర్శకంగా పన్ను నిర్ధారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూళ్లలో లోపాలు లేకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

స్కూల్‌ బస్సుల తనిఖీ

జనగామ: జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రవానాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా రవాణా అధికారి(డీటీఓ) ఎంఆర్‌ శిల్ప ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు ప్రైవేటు స్కూల్‌ బస్సులను మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని పలు ప్రైవేటు స్కూల్‌ బస్సులకు జరిమానాలు విధించారు. తనిఖీల్లో ఎంవీఐ విష్ణు దీపక్‌, ఏఎంవీఐలు శ్వేత, నవిత పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ శిల్ప హెచ్చరించారు.

రెండు బస్సుల సీజ్‌

పాలకుర్తి టౌన్‌: మండల కేంద్రంలో స్కూల్‌ బస్సులను ఏఎంవీఐ శ్వేతారెడ్డి తనిఖీ చేశారు. 10కి పైగా పాఠశాలల బస్సులను ఆపి తనిఖీ చేశారు. ఇందులో ఫిట్‌నెస్‌ లేని రెండు బస్సులను సీజ్‌ చేశామని ఆమె వెల్లడించారు.

బ్యాంకింగ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

రఘునాథపల్లి: ప్రతీ ఒక్కరు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక వృద్ధి సాధించాలని ఆర్‌బీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ హేమలత సూచించారు. మంగళవారం మండలంలోని నిడిగొండలో జనగామ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (ఎఫ్‌ఎల్‌సీ) ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ బ్రాంచ్‌లో బ్యాంకింగ్‌ సేవలు, ప్రభుత్వ బీమా పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.. కేంద్ర పభుత్యం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి, అటల్‌ పెన్షన్‌ బీమా యోజన పథకాలు, ఆడపిల్లల భవిష్యత్‌ కోసం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం, సేవింగ్స్‌ ఖాతాల నిర్వహణ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన పెంచుకోవాలన్నారు. లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ మూర్తి మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌ రంగానికి సంబంఽధించిన వివిద సేవలు, రుణ సదుపాయాల గురించి వివరించారు. కార్యక్రమంలో బ్రాంచ్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌రెడ్డి, జనగామ ఆర్థిక ఆక్షరాస్యత కౌన్సిలర్స్‌ అనిల్‌గౌడ్‌, ఉదయ, ప్రమోద్‌, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

రఘునాథపల్లి: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ భీంశర్మ సూచించారు. మంగళవారం రాత్రి మండలంలోని వెల్ది గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలు, సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, లింక్‌లు నమ్మ వద్దని, ఓటీపీని ఇతరులకు చెప్పవద్దన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జనగామ రూరల్‌ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్‌, సర్పంచ్‌ సింగిరెడ్డి సునిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement