విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

జనగామ రూరల్‌: విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, అలాగే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. మంగళవారం జనగామ మండలంలోని ఓబుల్‌కేశవాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రాథమిక పాఠశాల, అంగన్‌న్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి, తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యా కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించి, ప్రతీ విద్యార్థికి పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, లక్ష్యాలు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు.

‘సర్‌’ విజయవంతానికి బీఎల్‌ఓల పాత్ర కీలకం

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్‌ లెవల్‌ అధికారుల పాత్ర (బీఎల్‌ఓలు) కీలకం అని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. అంతకుముందు మాస్టర్‌ ట్రైనర్లు (రఘునాథపల్లి, చిల్పూర్‌ తహసీల్దార్లు) పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష న్‌ ద్వారా క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరాం, కిరణ్‌ ప్రకాష్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement