మోగనున్న మంగళవాయిద్యాలు | - | Sakshi
Sakshi News home page

మోగనున్న మంగళవాయిద్యాలు

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

నేటినుంచి శుభముహూర్తాలు

జిల్లాకు పెళ్లికళ

గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు

జనగామ: గత నెల 14వ తేదీ నుంచి నిలిచిపోయిన శుభముహూర్తాలు నేటి (బుధ వారం) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు కుటుంబాలు ఏర్పాట్లలో నిగ్నమయ్యాయి. ముహూర్తాలు లేక మందగించిన ఫంక్షన్‌హాళ్లు, పురోహితులు, భాజా భజంత్రీలు, డెకరేషన్‌, క్యాటరింగ్‌ తదితర అనుబంధ వ్యాపారాలు మళ్లీ కళకళలాడనున్నాయి. జూలై 8వ తేదీ వరకు 10 శు భ ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పండగ సందడి మొదలైంది.

నేటి నుంచి..

ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల జూలై 8వ తేదీ వరకు శుభముహూర్తాలు అందుబాటులో ఉన్నాయని పట్టణంలోని బతుకమ్మకుంట విజయదుర్గా మాత ఆలయ ప్రధాన పూజారి ఆరాధ్య శర్మ తెలిపారు. జూన్‌ 19, 24, 25, 26 తేదీలతో పాటు జూలై 1, 2, 3, 4, 5, 8 తేదీల్లో వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే జూలై 8 తర్వాత మళ్లీ శుభముహూర్తాలకు విరామం ఉండగా, ఆగస్టు 16వ తేదీ నుంచి తిరిగి శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయని వేద పండితులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement