జనగామ: నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.91లక్షలతో18 అభివృద్ధి పనుల ప్రతిపాదనలను తయారు చేసి కలెక్టర్, డీపీసీకి సమర్పించినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 10 విద్యాసంస్థలకు రక్షణ గోడలు, ఎస్సీ కాలనీలు, గిరి జన తండాల్లో 7 అంతర్గత సీసీ రోడ్లు, ఒక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టడం వల్ల స్థానికంగా 4,500 పైగా పని దినాలు పెరుగుతాయన్నారు. పరిపాలనా అనుమతులు వచ్చిన రూ.40 లక్షల పనులకు త్వరలో టెండర్లు పిలిచి వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభిస్తారన్నారు. మిగతా ప్రతిపాదనలకు అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరినట్లు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


