ప్రతిభావంతులకు ‘ఉపకారం’ | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు ‘ఉపకారం’

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

ఉన్నత స్థాయికి చేరుకోవాలి

జనగామ రూరల్‌: గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతిభ ఉండి భవిష్యత్‌లో గొప్ప అవకాశాలు అందుకుని ఉన్నతంగా స్థిరపడడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌ పేద విద్యార్థులకు భరోసా ఇస్తోంది. కేవలం ప్రభుత్వ డిగ్రీ, గురుకుల కళాశాలల్లో చదువుకునే వారికి ఈ అవకాశం లభి స్తోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు, మూడేళ్లకు రూ.90వేలు ప్రేమ్‌జీ సంస్థ అందిస్తోంది.

18 మంది గిరిజన విద్యార్థినులు ఎంపిక

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల ప్రతిభను గుర్తించిన అజీమ్‌ ప్రేమ్‌జీ యాజమాన్యం ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌ అందిస్తుండగా జనగామ పట్టణంలోని తెలంగాణ గిరిజన (మహిళ) సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు 18 మంది విశేష ప్రతిభ కనబరిచి అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అందించే స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా. జి. సంధ్యారాణి విద్యార్థినులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

కళాశాల నుంచి అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌కు 18 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. ప్రతిభ ఉండి కష్టపడి చదువుకోవాలని తపన ఉండే ప్రతీ విద్యార్థికి ప్రోత్సాహంగా ఉంటుంది. విద్యార్థినులు భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలి. దీనివల్ల కళాశాలకు మరింత పేరు ప్రతిష్టలు లభించాయన్నారు.

– ప్రిన్సిపాల్‌ జి.సంధ్యారాణి

పేద విద్యార్థులకు అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌ భరోసా

ప్రభుత్వ డిగ్రీ, గురుకుల కళాశాల విద్యార్థినులకు అవకాశం

గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ నుంచి 18మంది ఎంపిక

ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement