హోటళ్లపై మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లపై మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడులు

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని హోటళ్లు, బిర్యానీ పా యింట్లు, టీస్టాల్స్‌, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలపై సోమవారం మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌న్‌స్పెక్టర్‌ వినీల్‌, మున్సిపల్‌ అధికారులు పులి శేఖర్‌, గొర్రె కుమార్‌, నిఖిల్‌రెడ్డి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్ర మాణాలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు పాటించని హో టళ్లకు ఒక్కో సంస్థపై రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఇందులో అక్షయ హోటల్‌, రెడ్‌ బకెట్‌, ఎలైట్‌ మిలటరీ హోటల్‌, టీ ప్యాలెస్‌, కేకే ఫాస్ట్‌ఫుడ్‌, శ్రీమాతా హోటల్‌, ఎస్‌ఆర్‌ఎం హోటల్‌లకు ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70వేల జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. కమిషనర్‌ మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.70వేల జరిమానాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement