పనిచేసే పాఠశాలలోనే కుమారుడిని చేర్పించి.. | - | Sakshi
Sakshi News home page

పనిచేసే పాఠశాలలోనే కుమారుడిని చేర్పించి..

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

బచ్చన్నపేట: తాను పనిచేసే పాఠశాలలో తమ బాబును చేర్పించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభావతి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభావతి–మల్లేశం దంపతులు జనగామలో నివాసముంటున్నారు. ప్రభావతి మండలంలోని ఇటుకాలపల్లి హైస్కూల్‌లో సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త మల్లేశం ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌లో ఆర్‌ఎంగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ఉమేష్‌ చంద్ర జనగామ గీతాంజలి పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. కాగా ఉమేష్‌ చంద్రను తాను పనిచేస్తున్న ఇటుకాలపల్లి హైస్కూల్‌లో పదో తరగతిలో చేర్పించారు. ప్రభావతిని ఎంఈఓ ఇర్రి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు జీవరత్నం, విష్ణు, శ్రీనివాస్‌, సంతోష్‌, ఆదేష్‌, ఐజాక్‌, ముస్తాఫా అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement