జేత్యాతండా పాఠశాలలో ఒక్కరూ రాలే | - | Sakshi
Sakshi News home page

జేత్యాతండా పాఠశాలలో ఒక్కరూ రాలే

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

శ్రీభద్రకాళి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని చంద్రుతండా గ్రామ పంచాయతీ శివారు జేత్యాతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు ఒక్కరు కూడా హాజరుకాలేదు. వాస్తవానికి గత విద్యాసంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ముగ్గురు కాగా ఒక విద్యార్థి గత విద్యాసంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాడు. దాంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఇద్దరే. అందులో ఒక్కరు రెండో తరగతి, మరొకరు నాలుగో తరగతి. అయితే ఆ ఇద్దరిలో ఎవరూ పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల హాజరు సున్నా అయ్యింది. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు సీహెచ్‌.రమేశ్‌ సాయంత్రం వరకు పాఠశాలలో ఒక్కరే ఉండి వెళ్లాల్సి వచ్చింది. తండాకు చెందిన ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తుండగా జేత్యతండా పాఠశాల ఇప్పుడో అప్పుడో మూతపడే దుస్థితి నెలకొంది.

కేయూ ఫిజిక్స్‌ విభాగం బీఓఎస్‌గా నరేందర్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్‌ విభాగం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా ఆ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నరేందర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్‌ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్‌ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్‌కు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందించారు.

సోషియాలజీ బీఓఎస్‌గా స్వర్ణలత

కాకతీయ యూనివర్సిటీలోని సోషియాలజీ విభాగం బీఓఎస్‌గా ఆ విభాగం ప్రొఫెసర్‌ ఎం.స్వర్ణలతను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా బాధ్యతలను నిర్వర్తించిన ప్రొఫెసర్‌ అయిలయ్య నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆమె ఆ విభాగం అధిపతిగా కూడా కొనసాగుతున్నారు.

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, ఎస్‌ఈ ఇరిగేషన్‌ హరివెంకటరామ ప్రసాద్‌, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బండారు శివసుబ్రహ్మణ్యమ్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement