జనగామ రూరల్: పోలియో రహిత జిల్లా లక్ష్యంగా కృషి చేయాలని, అందుకు సమగ్ర కార్యాచరణ, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 0–5 సంవత్సరాల వయసు గల 33,651 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు. 277 మంది వలస పిల్లలను కూడా గుర్తించి టీకా వేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ మల్లికా ర్జునరావు, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, డీపీఓ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారులపై భద్రతకు చర్యలు
జాతీయ రహదారులపై భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణభద్రతే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోవర్ధనగిరి జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, ప్రమాదాల నివారణకు అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని, డ్రైవర్‌తో పాటు కండక్టర్ కూడా ఉండాలని, ప్రతీ బస్సులో సీసీ కెమెరాలు ఉండాలన్నారు. ఇన్‌చార్జ్ ఆర్‌అండ్‌బీ ఈఈ సరిత, ఎకై ్సజ్ అధికారి అనిత, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున రావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, నేషనల్ హైవేస్ అధికారులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలను నియంత్రించాలి
మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణపై ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
వారంలోగా వనమహోత్సవం పూర్తి చేయాలి
వారంలోగా వనమహోత్సవం పూర్తి చేయాలని, సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ తదితర అంశాల మీద ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల మంజూరుకు సంబంధించి తనిఖీని వారంలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రంగారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్ రెడ్డి, ఇన్‌చార్జ్ డీపీఓ వెంకట్ రెడ్డి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అమ్మ పేరుతో మొక్కను నాటండి
పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణకు అమ్మ పేరుతో మొక్కను నాటాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కారప్స్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్ 2026’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


