కొత్త పుస్తకాలు వస్తాయన్న సంతోషం.. | - | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు వస్తాయన్న సంతోషం..

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

మా చిన్నతనంలో ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వెళ్లేవాళ్లం. పాఠశాల ప్రారంభానికి వారం రోజుల ముందే మా తల్లిదండ్రులు సిద్ధం చేసేవారు. చదువుతో పాటు ఆటలకు ప్రత్యేక పీరియడ్‌ ఉండేది. అలాగే ప్రతీ రోజు పాఠశాల చివరిలో 4గంటల తర్వాత ఒక దేశభక్తి గేయం వినిపించేవారు. నాడు ప్రైవేట్‌ పాఠశాలలు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సి ఉంది.

– డాక్టర్‌ నామోజు బాలాచారి, కార్యదర్శి,

తెలంగాణ సాహిత్య అకాడమీ, ఓబుల్‌కేశవాపూర్‌, జనగామ

సర్పంచ్‌ నుంచి పట్వారీ వరకు ఓకే పాఠశాల

గ్రామం ఉండే పాఠశాలలో సర్పంచ్‌ పిల్లలతో పాటు పట్వారీ వరకు, ప్రతీ ఒక్కరి పిల్లలు ఒకే పాఠశాలలో చదివేవారు. తరతమ్య భేదాలు ఉండేవి కావు. 7వ తరగతి వరకు వడ్లకొండలో చదివాను. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నతంగా చదివా. ఓయూ వీసీగా పని చేసే అవకాశం లభించింది.

– డి. రవీందర్‌ యాదవ్‌, మాజీ వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ,

వడ్లకొండ, జనగామ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement