న్యూస్‌రీల్
జిల్లాలో విద్యాసంస్థల సమాచారం
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ విభాగాల్లో మొత్తం 508 పాఠశాలలు, 42 వసతి గృహాలు ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 341, ప్రాథమికోన్నత పాఠశాలలు 64, ఉన్నత పాఠశాలలు 103 ఉన్నాయి. అదేవిధంగా కేజీబీవీలు 12, మోడల్ స్కూల్స్ 8, యూఆర్‌ఎస్ 1, ఎయిడెడ్ పాఠశాలలు 10, రెసిడెన్షియల్ పాఠశాలలు 19 కొనసాగుతున్నాయి. వీటితో పాటు మైనార్టీ పాఠశాలలు 2, ఆశ్రమ పాఠశాలలు 2, బీసీ గురుకులాలు 9, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు 5 ఉన్నాయి. జిల్లాలో ఎస్సీ 17, బీసీ వసతి 18, ఎస్టీ వసతి గృహాలు 7 ఉన్నాయి.
యూనిఫామ్స్‌పై సందిగ్ధత,
పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కోసం సుమారు 60 వేల జతల యూనిఫామ్స్ అవసరం కాగా, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదు. పాఠశాల ప్రారంభం రోజు 50 మంది బాలురు, 50 మంది బాలికలు కలిపి మొత్తం 100 మందికి యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ఏ పాఠశాలలో పంపిణీ చేస్తారనే సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం రోజు విద్యార్థులకు 2,06,460 పాఠ్యపుస్తకాలు, 2,44,123 నోట్ బుక్స్ పంపి ణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
● వేసవి సెలవుల జ్ఞాపకాల మూటతో మళ్లీ బడికి
● విద్యార్థులతో కళకళలాడనున్న తరగతి గదులు


