జనగామ: వర్షాకాలంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడే ప్రమాదం ఉంటుంది. తెగిపడిన తీగలు, ఒరిగిన స్తంభాలు, ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు కనిపిస్తే వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా సమీప అధికారులకు సమాచారం ఇవ్వాలి. తడిసిన స్తంభాలు, స్విఛ్ బోర్డులు, వేలాడుతున్న తీగలను తాకకుండా, బట్టలు ఆరేసేందుకు ప్లాస్టిక్ దండెలను మాత్రమే వాడాలి. రేకులు, మెటల్ గేట్లకు వైర్లు తాకకుండా చూసుకోవాలి. రైతులు మోటార్లు, పైపులు తడిగా ఉన్నప్పుడు ముట్టుకోవద్దని, స్టార్టర్లకు సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన సర్వీస్ వైర్లు, ఐఎస్‌ఐ మార్క్ పరికరాలు వాడాలి.
సూచనలు పాటించాలి
ఇనుప కూలర్లు ఆన్‌్‌లో ఉన్న సమయంలో నీటిని పోయరాదు. ప్లాస్టిక్ కూలర్లు మేలు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విఛ్‌లు ఆపరేట్ చేయడం నిషేధం. షాక్ తగిలితే చేతులతో తాకకుండా కర్రతో వేరు చేయాలి. తీగల కింద టెంట్లు, జెండా గద్దెలు కట్టవద్దు. దేవుళ్ల విగ్రహాలు తరలించేటప్పుడు లైన్లకు తాకకుండా జాగ్రత్త పడాలి. అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించేందుకు కరెంట్ ఫెన్సింగ్ చట్టరీత్యా నేరం.
అత్యవసర సేవలు
వినియోగదారులు–8712481489 వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా సేవలు పొందవచ్చు. సబ్ డివిజన్ స్థాయిలో జీపీఆర్‌ఎస్ కలిగిన ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలను సిద్ధంగా ఉంచి, సమస్య తలెత్తిన వెంటనే బృందాలను పంపి పరిష్కరిస్తున్నారు.
విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
సూచనలు పాటించాలంటున్న అధికారులు
8712481489 వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా సేవలు


