‘సర్‌’ పేరుతో ఓట్లను తొలగిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పేరుతో ఓట్లను తొలగిస్తే ఊరుకోం

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

పాలకుర్తి టౌన్‌(దేవరుప్పుల): ‘సర్‌’ పేరుతో అసలైన ఓటర్లను తొలిగిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)పై దేవరుప్పల మండలంలోని కోలుకొండ గ్రామంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్ధాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఈనెల 15 నుంచి జూలై 31 వరకు అన్ని పోలింగ్‌ బూత్‌ స్ధాయిలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడడం దేశసేవగా భావించాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ అడ్డుకున్నా కేసీఆర్‌ సీఎం అవ్వడం ఖాయమన్నారు. అన్నారు. 100 సీట్లతో బీఆర్‌ఎస్‌ ఆధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ కేసీఆర్‌ వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు నిధులు తీసుకువచ్చిన ఘనత ఎర్రబెల్లికే దక్కుతుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌లో గెలిచి సిగ్గులేకుండా జై కాంగ్రెస్‌ నినాదాలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ వై.సతీష్‌రెడ్డి, మోటివేషనల్‌ స్పీకర్‌ శ్రీపాదరామ్‌, గాంధీనాయక్‌, తీగల దయాకర్‌గౌడ్‌, బస్వ మల్లేషం, కోతి ప్రవీణ్‌ కుమార్‌, పసునూరి నవీన్‌, జరపులు బాలు నాయక్‌, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ కేసీఆర్‌ వస్తేనే రైతులకు న్యాయం

నియోజకవర్గ స్థాయి సమావేశంలో

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement