నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా వాసులు

ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా

‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత

కాశిబుగ్గ: వరంగల్‌ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్‌రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్‌ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్‌రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్‌రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్‌, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement