ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

జనగామ రూరల్‌: ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులతో సమానంగా టెట్‌ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్‌ ఉపాధ్యాయుల సంఘం (టీపీయూఎస్‌) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చల్లా తిరుపతిరెడ్డి, అంకం సతీష్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో రౌండ్‌ టెబుల్‌ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 30 వేల మందికి పైగా ఉపాధ్యాయులు టెట్‌ అర్హత లేకపోవడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

పాలకుర్తి టౌన్‌: పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పోలీస్‌సేష్టన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, సేష్టన్‌ నిర్వహణ, పెండింగ్‌ కేసుల పురోగతిని పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బంది తో మాట్లాడుతూ పోలీస్‌శాఖ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రజలు అందించే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సీఐ జానకిరామ్‌రెడ్డి, ఎస్సై దూ డలం పవన్‌కుమర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఏఓపై కఠిన చర్యలకు ఆదేశాలు

జనగామ: వ్యవసాయ శాఖలో మహిళా ఉద్యోగుల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఏఓ విజయ్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశాల జారీ చేశారు. ఇప్పటికే ఏఓ లైంగిక వేధింపులు నిరోధించే పోష్‌ చట్టం 2013 కింద అరెస్ట్‌ అయి జైలులో ఉండగా, ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం లాంటి ఘటన రెండోసారి కావడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు సదరు ఏఓపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదుతో పాటు చట్టపరంగా కేసు నమోదు చేయగా, బాధిత మహిళా ఉద్యోగులకు న్యాయం చేశారు. ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో చాలా ఏళ్లుగా ఒకే కార్యాలయంలో ఉన్న ఏఓలను బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్‌లో మరెవరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించిన కలెక్టర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement