ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

పాలకుర్తి టౌన్‌: గ్రామస్తుల సహకారంతో తిరుమలగిని ఆదర్శ పంచాయతీగా తీర్చిద్దేందుకు కృషి చేస్తామని బాలవికాస సీనియర్‌ కోఆర్డినేటర్‌ ఈదురి వసంత అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణ పథంపై గ్రామసభ సర్పంచ్‌ చెరిపెల్లి మమత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమన్వయంతో పర్యావరణం, మంచినీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, మహిళా సంఘాల, డిజిటల్‌ అవగాహన తదితర అంశాలపై 8 కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం సమన్వయ గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా కూటికంటి రాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్లు రాజ్‌కుమార్‌, వినయ్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పొన్నం రాజు, మహిళ సంఘాల అధ్యక్షురాలు బక్క రమ, సీఏలు పుష్ప, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతుల అభివృద్ధికి మరింత కృషి

జనగామ రూరల్‌: జిల్లాలో పాడి రైతుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని నాబార్డ్‌ ఏజీఎం ఉదయ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో డీసీసీ బ్యాంక్‌ ద్వారా మైక్రో ఏటీఎం మిషన్‌న్లు పెద్దపహాడ్‌, సిద్దంకి, పెద్దరామచర్ల, బచ్చన్నపేట, నాగిరెడ్డిపల్లి ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక నాణ్యమైన పాలు జనగామ డెయిరీ నుంచే వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డెయిరీ ఉప సంచాలకుడు ఎన్‌.గోపాల్‌ సింగ్‌, పాల ఉత్పత్తిదారుల జిల్లా ఉపాధ్యక్షుడు దామెర నాగరాజు, మేనేజర్‌ నరేష్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మేనేజర్‌ లింగారెడ్డి, జనగామ డీసీసీ బ్యాంక్‌ మేనేజర్‌ కె.శ్రీనివాస్‌, కార్యదర్శి సూపర్‌వైజర్లు శ్రీనివాస్‌ రెడ్డి, విజయ్‌, శ్రీనివాస్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన విద్యార్థులు 2026–27 సంవత్సరానికి గాను 1వ తరగతికి (15), 5వ తరగతి(37)లలో మిగిలిన సీట్ల కోసం బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాలఅభివృద్ధి అధికారి విక్రమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలి పారు. సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ లో సెయింట్‌ థామస్‌ స్కూల్‌ ఇంగ్లిష్‌ మీడియం శివునిపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌(డే స్కాలర్‌, రెసిడెన్షియల్‌), సిద్ధార్థ విద్యాలయం, ఇంగ్లిష్‌ మీడియం పాలకుర్తి (డే స్కాలర్‌), జాన్‌బ్రిటో హైస్కూల్‌ ఇంగ్లిష్‌ మీడి యం, కడవెండి (డే స్కాలర్‌, రెసిడెన్షియల్‌), సెయింట్‌ పీటర్‌ ఫౌండేషన్‌ హైస్కూ ల్‌ ఇంగ్లిష్‌ మీడియం నిడిగొండ (డే స్కాలర్‌, రెసిడెన్షియల్‌) ఉన్నాయి.

వినియోగదారులకు

ఇబ్బందులు కలగొద్దు

జనగామ రూరల్‌: విద్యుత్‌ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమస్యల షరిష్కారానికి కృషి చేయాలని విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌–1) చైర్మన్‌ వేణుగోపాలచారి అధికారులకు సూచించారు. శుక్రవారం గానుగుపహడ్‌ సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జనగామ, బచ్చన్నపేట మండలాలోని పలు గ్రామాల ప్రజలు రైతులు పాల్గొని వినతులు అందజేశారు. విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు మార్చటం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, తదితర సమస్యలపై అందించిన ఫిర్యాదులపై అధికారులు వివరించారు. ఈకార్యక్రమంలో డీఈ, ఏడీ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement