ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

జనగామ రూరల్‌: ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శివాజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా బ్లాక్‌బోర్డుపై విద్యార్థులకు విద్యతోపాటు, ట్రాఫిక్‌ రూల్స్‌ బోధించారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగం, ట్రాఫిక్‌ నిబంధనల ప్రాముఖ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు సాంబమూర్తి శర్మ, శివాజీ ఫౌండేషన్‌ సభ్యులు ప్రభాకర్‌, సిరిపురం వినయ్‌, మామిడాల భరత్‌, హర్షిత్‌, శీలం గణేష్‌, వినీత్‌, సాయి తేజ, ములుగు ఆకర్ష, పంతం సాయి ప్రసాద్‌,సందీప్‌, వినీత్‌, దిలీప్‌, కిరణ్‌, శ్రీకాంత్‌ భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement