బాలికలదే హవా.. | - | Sakshi
Sakshi News home page

బాలికలదే హవా..

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ఫలితాల విడుదల

జనగామ రూరల్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,600 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో 2,362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలికలదే హవా కొనసాగింది. సెకండియర్‌ జనరల్‌ బాలురులు 593 మంది పరీక్ష రాయగా 387 మంది ఉత్తీర్ణత సాధించి 65.25 శాతం నమోదైంది. బాలికలు 238 మంది పరీక్షలకు హాజరు కాగా 238 మంది ఉత్తీర్ణత సాధించి 65.21 శాతంగా నిలిచారు. మొత్తం 958 మందికి 625 మంది ఉత్తీర్ణత సాధించగా 65.24శాతం నమోదైంది. ఫస్టియర్‌ జనరల్‌లో బాలురు 864 మంది పరీక్షలు రాయగా 494 మంది ఉత్తీర్ణత సాధించగా 57.18శాతంగా ఉన్నారు. బాలికలు 1,103 మంది పరీక్షలకు హాజరు కాగా ఇందులో 825 మంది ఉత్తీర్ణత సాధించి 74.80 శాతంగా ఉంది. మొత్తం 1,967 మందికి గాను 1,319 మంది ఉత్తీర్ణత సాధించగా 67.06 శాతం ఉంది. అలాగే సెకండియర్‌ ఒకేషనల్‌లో బాలురు 223 మంది పరీక్షలకు హాజరుకాగా 116 మంది ఉత్తీర్ణత సాధించారు. 52.02 శాతంగా నమోదైంది. బాలికలు 79 మందికి 66 మంది ఉత్తీర్ణత సాధించగా 54 శాతంగా ఉంది. మొత్తం 302 మందికి 182 మంది ఉత్తీర్ణత సాధించగా 60.26 శాతం ఉంది. ఫస్టియర్‌ ఒకేషనల్‌లో బాలురు 230 మందికి గాను 123 మంది ఉత్తీర్ణత సాధించగా 53.48 శాతంగా ఉంది. బాలికలు 143 మందికి 113 మంది ఉత్తీర్ణత సాధించగా 79.02 శాతంగా నమోదైంది. మొత్తం 373 మంది పరీక్ష రాయగా 236 మంది ఉత్తీర్ణత సాధించారు. 63.27 శాతంగా ఉంది.

ఉత్తీర్ణత శాతాలు ఇవే..

సెకండియర్‌ (జనరల్‌) : 65.24

బాలురు : 65.25

బాలికలు : 65.21

ఫస్టియర్‌ (జనరల్‌) : 67.06

బాలురు : 57.18

బాలికలు : 74.80

సెకండియర్‌ (ఒకేషనల్‌) : 60.26

ఫస్టియర్‌ (ఒకేషనల్‌) : 63.27

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement