జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న 10వ బెటాలియన్ ఎన్‌న్‌సీసీ విద్యార్థి సీహెచ్ మైపాల్ జాతీయ అడ్వెంచర్ క్యాంప్‌నకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న విద్యార్థికి ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తర కాశిలోని నెహ్రూ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కాగా, ఎన్‌సీసీ కెడెట్లకు భారత సైన్యంలో అగ్నివీర్ ద్వారా డైరెక్ట్ ప్రవేశ అవకాశాలు లభించడంతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కూడా అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థి మైపాల్‌ను ప్రిన్సిపాల్, ఎన్‌సీసీ ఆఫీసర్ టి.కల్యాణి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.


