స్టేషన్‌ఘన్‌పూర్: డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ వాణిశ్రీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఘన్‌పూర్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్ సుధీర్‌కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వెళ్లారు. ఆయన స్థానంలో పెద్దపల్లి జిల్లాలో మాతాశిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ వాణిశ్రీ బదిలీపై స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చారు. ఈ మేరకు ఆమెకు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు శ్రీవాణి, హస్న, అజయ్‌కుమార్, సీహెచ్‌ఓ జయపాల్‌రెడ్డి, సూపర్‌వైజర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వాహనాల వేలం
రఘునాథపల్లి: మండలంలోని పోలీస్‌స్టేషన్ పరిధి కంచనపల్లి గ్రామానికి చెందిన అమృతం అంజయ్యపై 2023లో అనుమతులు లేకుండా బెల్ట్‌షాపు నిర్వహించినందుకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న టీవీఎస్ ఎక్సెల్ టీఎస్ 27ఎఫ్1522, ప్యాసింజర్ ఆటో ఏపీ 36 ఎక్స్ 4749 వాహనాలను డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ వరంగల్ ఆదేశాల మేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జనగామ ఎకై ్సజ్ అధికారి ఆధ్వర్యంలో రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ అవరణలో వేలం నిర్వహించనున్నట్లు అసక్తి గలవారు వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు.
రేపు విద్యుత్
వినియోగదారుల సమావేశం
జనగామ రూరల్: జనగామ మండలంలోని గానుగుపహడ్ సబ్‌స్టేషన్ అవరణలో ఈ నెల 12న విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్ పర్సన్ ఎన్‌వీ వేణుగోపాలచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జనగామ, బచ్చన్నపేట మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రాన్‌ఫార్మర్లు మార్చడం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, మీటర్లు మార్చడం తదితర అంశాలపై చర్చించడంతో పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేయవచ్చునన్నారు.
హెల్త్ వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా డాక్టర్ వందన
కాశిబుగ్గ: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా డాక్టర్ వందన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆమె పరిపాలన భవనంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా చాన్స్‌లర్ డాక్టర్ రమేశ్‌రెడ్డిని కలిసి పూలమొక్క అందజేశారు. కాగా, ఇంతకుముందు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ మల్లేశ్వర్ నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లేశ్వర్‌ను వీసీ డాక్టర్ రమేశ్‌రెడ్డితో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.
ముగిసిన జిల్లాస్థాయి చదరంగ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డికాలనీలో గల వికాస్ మాస్టర్జీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్–09 చదరంగ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో జక్కం గౌరిక్ సాయి, బైరి దేవాన్స్ రెడ్డి, అనిశెట్టి అద్విత్, లావడియా అక్షత్ చౌహన్, బాలికల విభాగంలో భగవత్ రీతిగా, ఎం.విక్షిత, రేపాక ఆరాధ్యరెడ్డి, సంహిత విజేతలుగా నిలిచారు. వీరు జూన్, 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు. కాగా, విజేతలకు మాస్టర్జీ గ్రూప్ ఆఫ్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ లావణ్య బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు ప్రేమ్ సాగర్, రజనీకాంత్, పవన్, తదితరులు పాల్గొన్నారు.


