జనగామ: మైనారిటీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మైనారిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ మైనారిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్ష పదవికి అర్హులైన నాయకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి గల నాయకులు రెండు రోజుల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణరెడ్డి, ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్, బడికె ఇందిర, టీపీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమాల్ షరీఫ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాఫర్ షరీఫ్, డీసీసీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి


