జనగామ రూరల్: పట్టణంలోని మూడో వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు సీసీ అంతర్గత రోడ్లు, హైమాస్ట్ లైట్లతో పాటు గార్లకుంటను పార్కుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, బొట్ల శేఖర్, బూడిది గోపి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, గుండు శశిరేఖ, భానోతు ధర్మభిక్షం నాయక్‌తో కలిసి 3వ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి వినతి చేశారు. 3వ వార్డు దిగువ లోతట్టు ప్రాంతంగా ఉండడంతో వర్షాకాలంలో ఇబ్బందికరంగా మారిందన్నారు. స్పెషల్ ప్యాకేజీ ద్వారా మోడల్ కాలనీగా వార్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.5కోట్ల నిధులు మంజూరు చేయించాలని వారు కోరారు. అలాగే జిల్లా కేంద్రం మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంత్రి పొంగులేటిని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి వినతి చేశారు.


