వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కె.ప్రవీణ్ కుమార్ హనుమకొండ ట్రాఫిక్, సుబ్బారెడ్డి టాస్క్‌ఫోర్స్, దేవేందర్ టాస్క్‌ఫోర్స్, దామోదర్‌రెడ్డి సీసీఆర్‌బీ, చేరాలు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్, ఎ.రమేశ్ ఏహెచ్‌టీయూ, ఎ.ప్రవీణ్‌కుమార్ పీసీఆర్, కమాండ్ కంట్రోల్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
నేడు బూత్ లెవెల్
ఏజెంట్లకు శిక్షణ
జనగామ: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నేడు (మంగళవారం) ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పసరమడ్ల గ్రామం ఉషోదయ కన్వెన్షన్ హాల్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి వస్తున్నారని, ఈ శిక్షణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్స్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
దివ్యాంగులకు
ట్రై స్రైకిళ్లు అందజేత
జనగామ రూరల్: జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలోని సముద్రాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఈగ పారిజాతం, కొడకండ్ల మండలం నరసింగపురం గ్రామానికి చెందిన జేడీ చంద్రకళ తమ జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్ అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ వెంటనే అదనపు కలెక్టర్ వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి బెన్‌షాలోమ్‌కు వారి అర్హతలు పరిశీలించి ఇద్దరు లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు మంజూరు చేసి అందజేశారు.
మానవత్వం చాటుకున్న కలెక్టర్
జనగామ: కొండాపూర్ ఎర్రకుంట తండాకు చెందిన దివ్యాంగుడు బానోత్ రాములు పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెంటనే స్పందించి వీల్‌చైర్ అందజేశారు. ఈసందర్భంగా రాములు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కేఎంసీ ప్రిన్సిపాల్‌గా మోహన్‌దాస్
పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు షురూ


