కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న బాధ్యతలను స్వీకరించారు. ప్రొఫెసర్ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు.


