చెరువుల చెంత ‘మృగశిర’ సందడి | - | Sakshi
Sakshi News home page

చెరువుల చెంత ‘మృగశిర’ సందడి

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

జనగామ: నేటి(సోమవారం)మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపల విక్రయాలు భారీగా జరిగాయి. మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విశ్వాసం కొనసాగుతుండటంతో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో చెరు వులు, చేపల దుకాణాలు, తాత్కాలిక చేపల విక్ర య కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలా డాయి. మరోవైపు హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది పంపిణీ చేసే చేప మందు కోసం జిల్లా నుంచి అనేక మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందనే నమ్మకంతో వేలాది మంది చేపమందు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌పూర్‌: నేడు మృగశిర కార్తె ఉండగా ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లితో పాటు పలు గ్రామాల్లో చెరువుల వద్ద ముందస్తు మృగశిరకార్తె సందడి నెలకొంది. ఆయా గ్రామాల చెరువుల వద్ద చేపలు పట్టేవారు, చేపలు కొనుగోలు చేసి తీసుకునే వాళ్ళతో సందడి నెలకొంది. సాధారణంగా కిలో రూ.150లకు విక్రయించే తెల్లచేపను మృగశిర కార్తె సందర్భంగా రూ.200లకు విక్రయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement