గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం దోస్త్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ప్రారంభం అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

జఫర్‌గఢ్‌: తెలంగాణ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27విద్యా సంవత్సరానికి కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. అర్హత కలిగిన విద్యార్థులు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మే 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుందన్నారు. పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు.

జనగామ రూరల్‌: పట్టణంలోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ ఆదేశానుసారం దోస్త్‌ డిగ్రీ అడ్మిషన్‌ సెంటర్‌ను ఏర్పా టు చేశామని కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. మూడు దశలలో ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని ఈనెల 15 నుంచి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీట్ల కేటాయింపు జూన్‌ 20 వరకు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ జూన్‌ 20 నుంచి 25 వరకు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కో ఆర్డినేటర్‌ ఎ.రవీంద్ర నాయక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ కరుణాకర్‌ 9701046411, 9912437032 ఫోన్‌ నెంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ 4, 5వ వార్డు కౌన్సిలర్లు బూర్ల రాజేశ్వర్‌ముదిరాజ్‌, చల్లా రమ్యరఘురెడ్డి అన్నారు. ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని అంగన్‌వాడీ సెంటర్లను వారు బుధవారం సందర్శించారు. శివునిపల్లిలోని ఆరు అంగన్‌వాడీ సెంటర్లలో ఒక సెంటర్‌ ప్రైమరీ స్కూల్‌లో నడుస్తుండగా మిగిలిన ఐదు సెంటర్లు అద్దె భవనాల్లో నడిపిస్తున్నట్లు వారు గమనించారు. ఈ సందర్భంగా శివునిపల్లి బొడ్రా యి సమీపాన ఉన్న ప్రభుత్వ స్థలంతో పాటు పలు ప్రభుత్వ స్థలాలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బూర్ల విష్ణు, అంగన్‌వాడీలు ఎం.అరుణ, జి.ఉపేంద్ర, వి.శోభారాణి, సరోజన, స్వరూప పాల్గొన్నారు.

జనగామ రూరల్‌: రైతులు మద్దతు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం జనగామ మండలం పెద్దపహాడ్‌, గోపరాజుపల్లి, వెంకిర్యాల, గానుగపహాడ్‌, మరిగడి గ్రామాల్లో ఏకేపీ, పీఎసీఎస్‌ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు కర్రె పర్శరాములు, తోటపల్లి రాజేశ్వరి, గద్ద చంద్రశేఖర్‌, శానబోయిన అనూ ష మహిపాల్‌, ఈర్ల అలేఖ్య నవీన్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement