ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్
రఘునాథపల్లి: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి మంగళవారం ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపారు. ఈసందర్భంగా జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్.స్వాతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్, సర్పంచ్ బొల్లం ఉమారాణి, మాజీ సర్పంచ్ పోకల శివకుమార్ ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని, కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో పర్యవేక్షకుడు కుర్ర సురేందర్‌గౌడ్, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, కోళ్ల రవిగౌడ్, పేర్నె రవి తదితరులు పాల్గొన్నారు.
కుమారుడిని ప్రభుత్వబడిలో చేర్పించిన తహసీల్దార్
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉద్యోగులే ముందడుగు వేయాలన్నా సందేశాన్ని ఆ అధికారి చేతల్లో చూపించారు. తమ కుమారుడిని మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్థానిక తహసీల్దార్ కడుపుకంటి సరస్వతి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని ఉద్దేశంతో తన కుమారుడు శ్రీవర్ధన్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. శ్రీవర్ధన్‌కు ప్రధానోపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ నాలుగో తరగతిలో ఆడ్మిషన్ అందించారు.
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
జనగామ: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలిక ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
మున్సి‘పోల్’ నిబంధనలు ఇవి..
జనగామ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు ఎలా వేయాలి? వాటి నిబంధనలు ఏంటి? అనే సమాచారాన్ని సాక్షి అందిస్తోంది. పార్టీ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ఆర్‌ఓకు తప్పనిసరిగా బీఫాం సమర్పించాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు, స్వతంత్రులకు మాత్రం 10 మంది అవసరం. ఒక్కరు గరిష్టంగా 4 నామినేషన్లు వేయవచ్చు.
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్


