
ఆయిల్‌పామ్ తోట అగ్నికి ఆహుతి
● రూ.10 లక్షల మేర నష్టం
రఘునాథపల్లి: కోమళ్ల గ్రామానికి చెందిన బత్తోజు ఆంజనేయులు సాగు చేసిన ఐదెకరాల ఆయిల్‌పామ్ తోట ఆదివారం మధ్యాహ్నం అగ్నికి ఆహుతైంది. తోట పక్కనే ఉన్న భూముల రైతులు ఇటీవల జేసీబీతో కంపచెట్లు తొలగించి కుప్పగా వేసి నిప్పు పెట్టడంతో మంటలు ఆయిల్‌పామ్ తోట చుట్టూ వ్యాపించి పచ్చ ని చెట్లు కాలిపోయాయని బాధిత రైతు ఆరోపించారు. 100 నంబర్‌కు డయల్ చేయగా పోలీసులు చేరుకుని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దారి సక్రమంగా లేకపోవడంతో ఫైరింజన్ తోట వద్దకు చేరుకోలేక వెనుదిరిగి పోయింది. రెండున్నర సంవత్సరాల క్రితం సాగు చేసిన తోట ఆరు నెలల్లో చేతికందనున్న పంట అగ్నికి ఆహుతి కావడంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆంజనేయులు వాపోయాడు. ముళ్ల పొదలను తగులబెట్టిన సదరు రైతులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న ఆయన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశాడు.