జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌

Apr 26 2025 1:19 AM | Updated on Apr 26 2025 4:31 PM

జనగామ రూరల్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బి.ప్రతిమను శుక్రవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా మార్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.

ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లించాలి

లింగాలఘణపురం: తమ పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వేతనాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలని నాన్‌ మల్టీపర్పస్‌ గ్రామ పంచాయ తీ సిబ్బంది హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో శుక్ర వారం వినతి పత్రం అందజేశారు. మండల పరిధి 21 జీపీల్లో 102 మంది పంచాయతీ సిబ్బంది పని చేస్తుండగా అందులో 79 మంది ని మాత్రమే మల్టీపర్పస్‌ వర్కర్లుగా గుర్తించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసి ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తున్నారు. మిగిలిన 33 మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో జీపీ తీర్మానం మేరకు విధుల్లోకి తీసుకున్న తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బంది డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఇట్టబోయిన మహేందర్‌, చింతల కనకరాజు, వెంకటేశ్‌, యాదగిరి, మల్లేశ్‌, నర్సయ్య తదితరులు ఉన్నారు.

ఆర్టీసీ క్యూఆర్‌ కోడ్‌ కీ చెయిన్ల పంపిణీ

జనగామ: ఆర్టీసీ సేవలకు సంబంధించి కొత్తగా వినియోగంలోకి తెచ్చిన క్యూఆర్‌ కోడ్‌తో కూడి న కీచేయిన్లను జనగామ డిపో మేనేజర్‌ స్వాతి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ యాదమణిరావు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ అవినాశ్‌ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లా అధికారులకు అందజేశారు. స్కానర్‌ ఓపెన్‌ చేసి ఆర్టీసీ యాప్‌ల ద్వారా అందే సేవల గురించి వివరించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్‌, డీఆర్డీఓ వసంత, సీఐ దామోదర్‌రెడ్డి, సబ్‌ రిజిస్ట్రార్‌ కరుణ పాల్గొన్నారు.

పాకిస్తానీలపై ఎస్‌బీ ఆరా

జనగామ: పహల్గాం టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ దేశానికి చెంది న వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అనే కోణంలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ వర్గాలు శుక్రవారం ఆరా తీశాయి. పట్టణంతో పాటు ఆయా మండలాల పరిధిలో పోలీసులు, నిఘావర్గాలు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టణంలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన వారు ఉండగా.. గతంలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది.

మే 17న కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

జనగామ రూరల్‌: జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు మే 17న నిర్వహిస్తున్న ట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు మెరుగు బాలరా జు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులకు జరిగే ఈ ఎన్నికల కు రిటర్నింగ్‌ అధికారులుగా కాముని శ్రీనివాస్‌ బాబు, లగిశెట్టి కృష్ణమూర్తి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సూర్యాపేట రోడ్డులోని కెమిస్ట్‌ భవనంలో జరిగే ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేఎన్‌ ఫార్మసీలో మే 15న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు స్వీకరిస్తారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ 16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఎన్నికలు 17న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని వివరించారు.

మందుల కొరత ఉండొద్దు..

జనగామ: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌, రాష్ట్ర పారా మెడికల్‌ బోర్డు సెక్రెటరీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారి బి.ప్రేమ్‌కుమార్‌ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శుక్రవారం ప్రేమ్‌కుమార్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ బృదం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ముందుగా కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌, జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, లింగాలఘణపురం, రఘునాథపల్లి పీహెచ్‌సీ, జనగామ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను తనిఖీ చేశారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు సరఫరా చేస్తున్న మందులు, నిల్వలను పరిశీలించారు. 

ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఈ–ఔషధి తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట టాస్క్‌ ఫోర్స్‌ బృందం సభ్యులు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మ ద్‌, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌రా వు, ఉమ్మడి జిల్లా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ఇన్‌చార్జ్‌ భాస్కరరావు, జనగామ సీఎంఎస్‌ ఫార్మసీ అధికారి మల్లేశ్వరి, రాజేందర్‌, డాక్టర్లు శ్రీతేజ, అశోక్‌, కమలహాసన్‌ తదితరులు ఉన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని  కలిసిన కలెక్టర్‌1
1/1

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement