
కార్పొరేట్ తరహాలో సర్కారు విద్య
పాలకుర్తి టౌన్: సర్కారు పాఠశాలల్లో కార్పొరేట్ తరహా నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న ప్రహరీ, మరుగుదొడ్ల పనులకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంత రం పాఠశాలలో వంట గదిని సందర్శించి భోజనంనాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచింద ని గుర్తు చేశారు. పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎం సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో పాఠశాల హెచ్‌ఎం పాయం శోభారాణి, రాపాక సత్యనారాయణ, యాకాంతరావు, కమ్మగాని ఆంజ నేయలుగౌడ్, కమ్మగాని నాగన్న, ఎడవెల్లి సోమమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి