
పుట్టుకనుంచే రెండు కాళ్లు పనిచేయవు
పదకొండేళ్ల కూతురు మిన్నుకు పుట్టుక నుంచే రెండు కాళ్లు పనిచేయవు. 5వ తరగతి చదువుతోంది. సదరం సర్టిఫికెట్ కోసం పదేళ్ల నుంచి స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్నాను. రెండు నెలల క్రితం స్లాట్‌బుకింగ్ దొరుకగా సదరంలో పర్మనెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికీ రెండుసార్లు గ్రీవెన్స్‌కు వచ్చిన. పింఛన్ మాత్రం రావడం లేదు. కాళ్లు పనిచేయని పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కనికరించడంలేదు.
– కూతురు మిన్నుతో తండ్రి
విద్యాసాగర్, వల్మిడి(పాలకుర్తి)