
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
జఫర్‌గఢ్: మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు సదాశివ, భరత్ ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌లోని శ్రీవాణి గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఎండీ పర్వేజ్, షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులు సాంబరాజు అభినందించారు.
మార్కెట్‌లో అవినీతిపై విచారణ చేపట్టాలి
జనగామ రూరల్: జనగామ, కొడకండ్ల, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో దొంగ టీఆర్‌లతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జిల్లాస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 15 పత్తి మిల్లులు ఉన్నాయని ఈ మిల్లుల్లో ప్రభుత్వం రైతు సంఘం పోరాట ఫలితంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని ఆన్‌లైన్ తక్ పట్టీలు సంబంధం లేని వ్యక్తులపై టీఆర్, ఐడీ నంబర్లు సృష్టించి ప్రతి కింటాకు రూ.22 చొప్పున సుమారు రూ.కోటి 20 లక్షలు అక్రమ పద్ధతిలో చేతులు మారినట్టు తెలుస్తుందని తెలిపారు. పల్లికాయ కొనుగోలుపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు
జనగామ: ఆరోగ్య తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పో షణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆదివా రం కుర్మవాడ, బెగ్గర్స్ కాలనీల పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్లలో పోషణ పక్షోత్సవం నిర్వహించారు. తలుల్లు, గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం ఉండొద్దని డీడబ్ల్యూఓ ఫ్లోరెన్సీ, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్‌గౌడ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మనోహర, సీహెచ్‌ఓ జానమ్మ పిలుపునిచ్చారు. చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. తల్లులు, బాలింతలు, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. చేతులను శుభ్రం చే సుకునే ఏడు రకాల పద్ధతులను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలా మృతం, పాలు, స్నాక్స్, సంపూర్ణ భోజనం ఎ లా ఉందని తల్లులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లులు, పిల్లలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. బెగ్గర్స్ కాలనీ సెంటర్‌లో ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, సర్టిఫికెట్లను అందజేశారు. పవిత్ర, హేమలత, స్వర్ణలత, స్వప్న, ప్రమీల, లక్ష్మి ఉన్నారు.