
ఆర్మీలో చేరాలనుంది..
కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్‌ఎస్‌లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా.
– ఇట్టబోయిన గణేశ్, విద్యార్థి, వేలేరు
పలు రంగాల్లో
అవగాహన కల్పించాలి..
పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్ క్లాస్‌కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్ నేర్పిస్తున్నా.
– చింత శ్యాంసుందర్, హనుమకొండ
కోచింగ్ పంపిస్తున్నాం..
మాకుమార్తె వర్షిణి ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం కళాశాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో నీట్ కోచింగ్‌కు పంపిస్తున్నాం. అలాగే కూచిపూడి, సంగీతంలో కూడా శిక్షణ ఇప్పిస్తున్నాం.
– కొలిపాక సునీత,
స్టేషన్‌ఘన్‌పూర్

ఆర్మీలో చేరాలనుంది..

ఆర్మీలో చేరాలనుంది..