
ఉలిక్కి పడిన రైతులు
ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపాటు
బచ్చన్నపేట/జనగామ : ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.. ధాన్యం ఆరబోసిన రైతులంతా కొనుగోలు కేంద్రం సమీపాన చెట్టు కింద ఏర్పాటు చేసిన పందిరి కిందకు చేరారు. కొద్ది దూరంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ ధాటికి కూర్చున్న స్థలం నుంచి ఎగిరి పక్కకు పడ్డారు. 12 మందికి గాయాలు కాగా.. అందులో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామ చివరన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో జిల్లాలోని రైతులందరూ ఉలిక్కిపడ్డారు. కొనుగోలు కేంద్రానికి 20 మీటర్ల దూరంలో హైటెన్షన్ వైరు ఉంది. పిడుగు పాటుకు మెరుపులు వచ్చాయి. అదే సమయంలో వర్షం పడుతోంది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ వచ్చి ఈ ప్రమాదం జరిగి ఉంటుంద ని గ్రామస్తులు అంటున్నారు. పిడుగు పడిన సమయంలో కొనుగోలు కేంద్రం వద్ద దాదాపు 200 మంది ఉన్నట్లు సమాచారం.
ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థత
పిడుగు పాటు ఘటనలో గాయపడ్డ వారిలో ఎనిమి ది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో గ్రామానికి చెందిన దండ్యాల మల్లారెడ్డి, గంట పద్మ, వంగపల్లి సుశాంత్‌రెడ్డి, వంగపల్లి మల్లారెడ్డి, పాకాల మల్లయ్య, బీరెడ్డి జనార్ధన్‌రెడ్డి, బీరెడ్డి భారతమ్మ, పారుపల్లి నందిని ఉన్నారు. వారు జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపస్మారక స్థితికి చేరిన వంగపల్లి సుశాంత్, పారుపల్లి నందినికి ఆస్పత్రి వైద్యులు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు ధాటికి గాయపడిన వారిలో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. అవయవాలు పని చేయక కొందరు, మరికొందరు మాట్లాడలేక పోతున్నారు. నరాల జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆస్పత్రి క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యులతో కిక్కిరిసి పోయింది.
సెంటర్ల వద్ద భద్రతపై ఆందోళన..
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పాటు సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్న పిడుగు పాటు జిల్లా యంత్రాంగంతో పాటు రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భద్రతపై చర్చ మొదలైంది. చెట్ల కింద చలువ పందిరి వేయడం.. ధాన్యం ఆరబోసుకునే స్థలం పక్కనే విద్యుత్ హైటెన్షన్ తీగలు, కొన్ని చోట్ల కొబ్బరి, తాటిచెట్లు ఉండడంతో పిడుగు పాటుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, అకాల వర్షాలు సంభవించిన సమయంలో రైతులకు అవగాహన కల్పించి, రక్షిత ప్రదేశానికి పంపించేలా సెంటర్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
12 మందికి గాయాలు.. వీరిలో 8 మందికి తీవ్ర అస్వస్థత
ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
అలీంపూర్ ఘటనతో తెరపైకి రైతుల భద్రత అంశం
అకాల వర్షాలు, వడగళ్లు కురిస్తే షెల్టర్లు ఎక్కడ?

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు

ఉలిక్కి పడిన రైతులు