
క్రీడలతో మానసిక ఉల్లాసం
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
జనగామ: క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ప్రెస్టన్ మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రాజీవ్ మెమోరియల్ ట్రోఫీ(కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ సీజన్–1) ముగింపు వేడుకల్లో శుక్రవారం పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతనం జనగామ వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన సమావేశంలో కొమ్మూరి మాట్లాడారు. నేటితరం యువత చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, రేపటి భవిష్యత్ కోసం అన్ని రకాలు గా సన్నద్ధమై ఉండాలని సూచించారు. పోటీల్లో మహబూబాబాద్ ప్రథమ, జనగామ జట్టు ద్వితీ య స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఆర్గనైజ ర్లు, క్రీడాకారులతో పాటు సీఐ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజ్, మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, కడారు ప్రవీణ్‌కుమార్, విజయ్, మల్లారెడ్డి, ప్రకాశ్ యాదవ్ పాల్గొన్నారు.