
కిషన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్
జనగామ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కి ఎమ్మెల్సీ దయాకర్, అంజన్‌కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి దిష్టిబొమ్మను శుక్రవారం జిల్లా కేంద్రం చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడు తూ.. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్‌కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. చౌకబారు మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నా రు. లేదంటే పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని హెచ్చరించారు. బొమ్మకంటి అనిల్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, దేవర ఎల్లయ్య, బజ్టూరి లక్ష్మీనరసయ్య, డాక్టర్ కల్నల్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.