ధర్మపురిలో విద్యాభివృద్ధికి హెచ్‌ఏఎల్‌ చేయూత | - | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో విద్యాభివృద్ధికి హెచ్‌ఏఎల్‌ చేయూత

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

● సీఎస్‌ఆర్‌ నిధులు రూ.10 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ముందుకు వచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చొరవ ఫలితంగా బుధవారం రాష్ట్ర సచివాలయంలో హెచ్‌ఏఎల్‌ ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మధ్య ఒప్పందం కుదిరింది. కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌, హెచ్‌ఏఎల్‌ హైదరాబాద్‌ చీఫ్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్స్‌ ఏవీ మురళీకృష్ణ, డీజీఎం (హెచ్‌ఆర్‌) సూర్యకాంత్‌ రౌత్‌, సీనియర్‌ మేనేజర్‌ ఎస్‌.సత్యనారాయణ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ధర్మపురి, వెల్గ టూరు, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని వేలాది మందికి డిగ్రీ కళాశాల వరంగా మారనుందని తెలిపారు. నూతన కళాశాల భవనం ఆధునిక తరగ తి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజి టల్‌ లెర్నింగ్‌ సదుపాయాలతో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. సీఎస్‌ఆర్‌ నిధులను సామాజికాభివృద్ధికి వినియోగిస్తూ విద్యారంగానికి హెచ్‌ఏఎల్‌ సంస్థ అందిస్తున్న సహకారానికి హెచ్‌ఏఎల్‌ యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, మంత్రి ఓఎస్డీ వైజే విజయ్‌ కుమార్‌, జిల్లా అధికారులు, హెచ్‌ఏఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement