రైతులు విద్యుత్‌ భద్రత సూచనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు విద్యుత్‌ భద్రత సూచనలు పాటించాలి

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

● ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం

కథలాపూర్‌: రైతులు విద్యుత్‌ భద్రత సూచనలు పాటించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. మండలంలోని గంభీర్‌పూర్‌ 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. 5 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. రైతులకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా ట్రాన్స్‌కో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. విద్యుత్‌ సమస్యలు వస్తే రైతులు మరమ్మతు చేయవద్దని, ట్రాన్స్‌కో సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈదురుగాలులతో విద్యుత్‌ సమస్యలు వస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు కాల్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఈ మధుసూదన్‌, జిల్లా సేఫ్టీ అధికారి గంగారాం, కోరుట్ల రూరల్‌ ఏడీఈ రఘుపతి, ఏఈ అశోక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఒక్క నిమిషం’పై ప్రచారం

జగిత్యాలజోన్‌: ఒక్క నిమిషం ఆలోచన.. జీవితా తం భద్రత అంశంపై విద్యుత్‌ సంస్థ ప్రచారం చేస్తోంది. సంబంధిత పోస్టర్‌ను విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శనం ఆవిష్కరించారు. ఇటీవల విద్యుత్‌ సిబ్బంది ప్రమాదాలకు గురవుతుండటంతో వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు మరింత అవగాహన పెంచేందుకు పోస్టర్‌ రూపొందించామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement