శునకం.. నిందితులపై గునపం | - | Sakshi
Sakshi News home page

శునకం.. నిందితులపై గునపం

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

● పోలీస్‌ శాఖలో ఏడు జాగిలాలు ● డ్రగ్స్‌, మత్తు పదార్థాల గుట్టు రట్టు ● దొంగతనాలు, హత్య కేసులు ఛేదించిన డాగ్స్‌

ఏడాది క్రితం కోరుట్ల పట్టణంలో ఓ చిన్నారి హత్యకు గురైంది. ముందుగా పోలీసులు ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తిని అనుమానించారు. అతడు సైకోలా వ్యవహరించడంతో స్థానికులు కూడా అతడినే నిందితుడిగా భావించారు. చివరకు పోలీసులు పోలీసు జాగిలాలను రంగంలోకి దింపారు. ఆ జాగిలాలు వాసనను పసిగట్టి ఓ మహిళను గుర్తించాయి. దీంతో పోలీసులు సదరు మహిళను అరెస్ట్‌ చేశారు.

కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో గతంలో భారీ చోరీ జరిగింది. నిందితుల కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసు జాగిలాలను రంగంలోకి దింపారు. నిందితులు ఎటు వెళ్లింది..? ఎక్కడ ఉంది..? మొత్తం పసిగట్టాయి. పోలీసులు నిందితులను పట్టుకుని దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు.

బీర్‌పూర్‌ మండలం నర్సింహులపల్లిలో ఓ హత్య జరిగింది. పోలీసుల విచారణలో ఏమీ తేలకపోవడంతో జాగిలాలను రంగంలోకి దింపారు. అవి నిందితులను గుర్తించడంతో హత్యకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

జాగిలాల పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ, ఇతర అధికారులు, పోలీస్‌ జాగిలాలు

జగిత్యాలక్రైం: నేరాలు పెరిగినకొద్దీ పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో అరికట్టేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దొంగతనాలు, హత్యలు, ఇతర నేరాలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులతోపాటు జాగిలాలు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. పెద్దపెద్ద నేరాలు జరి గినా.. వాటిని గుర్తించి నిందితులను పట్టిస్తున్నాయి.

ఒక్కో రంగంలో శిక్షణ

జిల్లా పోలీసు శాఖ ఆధీనంలో ఉన్న డాగ్స్‌కు ఒక్కో రంగంలో శిక్షణ ఇచ్చి ఆ రంగంలో వాటి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. నేరాలు జరిగినప్పుడు వాటిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి వాటి ద్వారా నిందితులను గుర్తించి చర్యలు చేపడుతున్నారు.

7 జాగిలాలు.. 7రకాల శిక్షణ

జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏడు జాగిలాలు ఉన్నాయి. ఒక్కో రంగంలో శిక్షణ పొంది పోలీసు శాఖకు సేవలు అందిస్తున్నాయి. నేరాలు జరిగినప్పుడు తాము శిక్షణ పొందిన రంగంలో నిందితులను పట్టిస్తున్నాయి.

సింబా: ట్రాకర్‌ డాగ్‌ దొంగతనం, హత్యలు వంటి కేసుల్లో నిందితుల జాడను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

జాకీ.. నార్కోటిక్‌ డాగ్‌, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు గుర్తించడంలో నైపుణ్యం కలిగి ఉంది.

రాకీ.. ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక్షన్‌ డాగ్‌. బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం పొందింది.

డాన్‌.. ట్రాకర్‌ డా గ్‌. నిందితుల జాడ ను అనుసరించి గుర్తి స్తుంది. నిందితులు నేరం చేసిన ప్రాంతం నుంచి ఎంత దూరం వెళ్లినా వారి అడుగు జాడలను గుర్తించి పట్టుకుంటుంది.

ర్యాంబో... ట్రాకర్‌ డాగ్‌. నిందితుల జాడను గుర్తించడంలో శిక్షణ పొంది అనేక నేరాలను గుర్తిస్తుంది. నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి చేస్తోంది.

యారో.. నార్కోటిక్‌ డాగ్‌. మాదక ద్రవ్యాలు, మ త్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు, ఇతర మాదక ద్రవ్యాలను గుర్తించడంలో నైపుణ్యం కలిగి ఉంది.

షాడీ.. ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక్షన్‌ డాగ్‌. పేలుడు పదార్థాల గుర్తింపులో నైపుణ్యం కలిగి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement