జగిత్యాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 662 అట్రాసిటీ బాధిత కుటుంబాలకు రూ.5,30,52,500 మంజూరు చేశామని, 105 కుటుంబాలకు రూ.74,45,000 ప్రభుత్వం నుంచి నిధులు రాగానే మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, సంజయ్, ఏఎస్పీ చేతన్ నితిన్, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ట్రేడ్‌లైసెన్స్ పేరిట నకిలీ ఫోన్‌కాల్స్
జగిత్యాల: జగిత్యాల బల్దియా పరిధిలోని వ్యాపారులు, వాణిజ్య సంస్థల యజమానులకు ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని నకిలీ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. 96663 26871, 9621 214847 నంబర్ల నుంచి కాల్స్ చేసి ట్రేడ్‌లైసెన్స్ త్వరగా చెల్లించాలని, లేకుంటే ఇబ్బంది పడతారంటూ బెదిరిస్తున్నారు. అయితే చాలా మంది వ్యాపారులు అప్రమత్తమై మున్సిపల్ అధి కారులను సంప్రదించి ఫేక్‌కాల్స్ నిర్ధారించుకుంటున్నారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. అనుమానాస్పద కాల్స్ వస్తే బల్దియాలో.. సమీ ప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ తెలిపారు.


