అంజన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు | - | Sakshi
Sakshi News home page

అంజన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

అంజన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

పుల్లా కార్తీక్‌తో అధికారులు

అంజన్న సన్నిధిలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్‌ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. న్యాయమూర్తిని ఆలయ ఈవో అంజనా రెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ముందుగా స్వామివారి ఆలయంలో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement