● అధికారుల ఆకస్మిక తనిఖీలు
● లబ్ధిదారులు లేకుంటే ఇళ్లు రద్దు
● దూరభారంతో ఉండని లబ్ధిదారులు
● కమిషనర్ ప్రకటనతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పొందిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
● సొంతింటి కల తీరిందన్న ఆనందంలో ఉన్నప్పటికీ.. అక్కడ వసతులు లేవని, పట్టణానికి దూరంగా ఉండటం అందులో ఉండలేకపోతున్నామని పేర్కొంటున్నారు.
● ప్రస్తుతం 4,200మందికి ఇళ్లు కేటాయించినా.. రెండు వేల మంది వరకే ఉంటున్నారు.
● మిగతా రెండు వేల మంది పట్టణంలోని అద్దె ఇళ్లల్లో ఉంటున్నట్లు సమాచారం.
● ప్రస్తుతం వారంతా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఎక్కడ ఇల్లు రద్దు అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● వాస్తవానికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లల్లో అనేక సమస్యలున్నాయి.
● పూర్తిస్థాయిలో మంచినీరు, స్కూల్ లేదు. సమీకృత మార్కెట్ లేకపోవడంతో అక్కడ ఉండేందుకు లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది.
● అధికారుల ఒత్తిళ్లతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు వెళ్లినప్పటికీ అక్కడ ఉండాలంటే అనేక ఇబ్బందులున్నాయి.
● చాలామంది జీవనోపాధి కోసం పట్టణంలోనే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.
● వీరు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు వెళ్లి జగిత్యాలకు రావాలంటే ప్రయాణ భారంతోపాటు, అధిక ఖర్చు అవుతుంది.
● పిల్లలను స్కూళ్లకు పంపాలన్నా ఆటో ఖర్చులు, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామన్నా అదనపు భారం పడుతుంది.
● అధికారులు స్పందించి రవాణా సౌకర్యంతో పాటు, స్కూల్స్, మార్కెట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటే అక్కడకు వెళ్లి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
● ఉండని వారి ఇళ్లను రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు.
● ఇటీవల మున్సిపల్ నుంచి మార్కెట్లు, ఇతరత్రా సౌకర్యాల కోసం నిధులు మంజూరయ్యాయి.
● నిధులతోనైనా పనులు ప్రారంభించి తమకు సౌకర్యాలు కల్పించాలన్న వాదన వినిపిస్తోంది.
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగి త్యాల మున్సిపల్ పరిధిలోని నూకపల్లి శివారులో పేద ల కోసం సుమారు 4520 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించారు. ఇందులో 4200 ఇళ్లను లబ్ధి దారులకు కేటా యించారు. అయితే ఈ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పట్టణానికి దూరంగా ఉండటంతో లబ్ధిదారులు ఇళ్లలో ఉండడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. సిటీకి సుమారు 5కిలోమీటర్ల దూరంలో ఉండడం.. పిల్లల చదువులు, ఉపాధి నిమిత్తం జగిత్యాలకు రావాలంటే బస్సు సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదా రులు అక్కడకు వెళ్లలేకపోతున్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను జియో ట్యాగింగ్ చేయాలని, ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, ఉండకపోతే ఇళ్లను రద్దు చేయాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రకటన రూపంలో విడుదల చేశారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇంట్లోనే ఉండాలని, అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చని, ఒకసారి రద్దు చేస్తే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయించడం కుదరదని ప్రకటించారు.
ఆందోళనలో లబ్ధిదారులు
కష్టాలు తీరేదెలా..?
డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పొందిన లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇళ్లలో ఉండాల్సిందే. అధికారులు వచ్చి తనిఖీలు చేస్తారు. వారు వచ్చిన సమయంలో ఇళ్లలో లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్ని వసతులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం.
– సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్
లబ్ధిదారులు ఉండాల్సిందే