● ఆస్పత్రిలో శానిటేషన్ అంతంత మాత్రంగానే ఉంది.
● వాష్‌రూమ్స్ సక్రమంగా లేవు. పురాతన భవనం కావడంతో పెచ్చులూడి పడుతున్నాయి.
● ఈ వర్షకాలంలో సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
● ఎక్స్‌రేకు సంబంధించిన ఫిల్మ్‌ల కొరత ఉండడంతో రోగులకు మొబైల్ ఫోన్లకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు.
● ఫోన్లు లేని వారికి ఆస్పత్రికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో వేస్తున్నారు.
● వాటిని చూసే డాక్టర్లు చికిత్స అందిస్తుండడం గమనార్హం.
● ఈసీజీ తీశాక ప్రింట్ ఇవ్వడం లేదు. ఫోన్లకే సమాచారం అందిస్తున్నారు.
● ఇటీవల ఓ వ్యక్తి ప్రమాదం జరిగి ఆస్పత్రికి వస్తే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
● దీంతో సదరు బాధితుడిని ప్రైవేటుకు తీసుకెళ్తే బిల్లు తడిచి మోపైడెంది.
● కొద్ది రోజుల క్రితం తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి వచ్చిన ఓ బాధితుడికి ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో వేరే రోగి సిలిండర్ తీసి చికిత్స అందించారు. ఇలా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సంఘటన చోటుచేసుకుంటుంది.
● ఇటీవల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ అధ్యక్షతన ఆస్పత్రి డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
● ఇన్‌పేషెంట్ సేవలు, శస్త్ర చికిత్సల పనితీరుపై చర్చించారు.
● ఆరోగ్యశ్రీకి సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ ద్వారా వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
● క్లినికల్ సేవలను మెరుగుపర్చాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకై తే ఏమీ అమలులోకి రానట్లు తెలిసింది.
● రోగులతో సిబ్బంది కమ్యూనికేషన్ పెంచేలా నిర్ణయించినప్పటికీ ఆ దిశగా అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
● నూతనంగా వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ రోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కనిపించని వైద్య పరికరాలు ఎక్స్‌రే విభాగంలో ఫిల్మ్ కొరత తాగునీటికీ ఇబ్బంది పడుతున్న రోగులు ఇంటి నుంచే తెచ్చుకుంటున్న బంధువులు ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి.. మెడికల్ కళాశాలకు అనుసంధానం కూడా. ఈ ఆస్పత్రికి నిత్యం వందలాది మంది ఇన్, అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. అయినా ఈ ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ప్రజాప్రతినిధుల పట్టింపులేని ధోరణి, వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో రోగులు నానా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోవైపు మౌలిక వసతులు కూడా ఇక్కడ కరువే. ఇటీవల ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం లేక రోగులు, వారి బంధువుల తిప్పలు పడ్డారు. ఇప్పటికీ ఆ సమస్య వారిని వేధిస్తూనే ఉంది. టెండర్లలో ఆలస్యం జరగడంతో రోగులకు కావాల్సిన మందులు సకాలంలో రావడం లేదు. ఫలితంగా రోగులకు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని చీటీ రాసిస్తున్నారు. ప్రధానంగా రోగులకు ఆహారం అందించే వంటగది మార్చురీ పక్కనే ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. అ క్కడ వంట చేయడంపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్నాయి.
ఆస్పత్రిలోని కొన్ని సమస్యలు..
గాడిలో పడేనా..?
సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు
ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. నీటిసమస్య కొంత తగ్గింది. ఈసీజీ, ఎక్స్‌రే ఫిల్మ్‌లు ఇస్తున్నాం. ఇటీవల జరిగిన సమావేశంలో ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు నిర్ణయించాం. త్వరలోనే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుంటున్నాం. – విజయ్, ఆర్‌ఎంవో