ఆలకించండి.. మార్గం చూపండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. మార్గం చూపండి

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

● ప్రజావాణిలో బాధితుల మొర ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు ● పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు బీఎస్‌.లత, రాజాగౌడ్‌ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులను ఆదేశించా రు. కార్యక్రమంలో డీఆర్‌వో ప్రసాద్‌, ఆర్డీవో మధుసూదన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెక్‌పవర్‌ రద్దు వద్దు

ఉపసర్పంచుల చెక్‌పవర్‌ను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. సర్పంచుల మాదిరిగా మాకు గౌరవ వేతనంగా రూ.5వేలు ఇవ్వాలి. ప్రోటోకాల్‌ ప్రకారం శిలాఫలకాలపై పేర్లు నమోదు చేయాలి.

– జిల్లా ఉప సర్పంచులు

నాణ్యత పాటించేలా చూడండి

రాయికల్‌లో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన పనులను కాంట్రాక్టర్‌ నాసిరకంగా చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న నిర్మాణాన్ని తనిఖీ చేయించి చర్యలు తీసుకోవాలి.

– పాలెపు బాలరాజు, రాయికల్‌

‘సెట్‌బ్యాక్‌’ అమలు చేయాలి

జిల్లాకేంద్రంలోని 37వ వార్డులో పూరెళ్ల శ్రీనివాస్‌ అనుమతి లే కుండా, సెట్‌ బ్యాక్‌ వదలకుండా భవనం నిర్మి స్తున్నాడు. మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు చేసిన. గ్రౌండ్‌ఫ్లోర్‌ పూర్తయి రెండో అంతస్తు పనులు సాగుతున్నాయి. విచారణ జరిపి సెట్‌బ్యాక్‌ వదిలేలా చూడండి.

పూరెల్ల జయశ్రీ, జగిత్యాల

మేము గ్రామ శివారు సర్వే నంబర్‌ 182లో నాలుగున్నర గుంటల భూమిని తేదీ 1989లో సాదాబైనామా ద్వారా కొని స్వాధీనంలో ఉన్నాం. 2020లో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ కు అవకాశం కల్పించడంతో దరఖాస్తు చేసుకున్నాం. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో ఆ భూమిని క్రమబద్ధీకరించేలా అధికారులను ఆదేశించండి. – ఊలవేని భీమయ్య, నందగిరి, పెగడపల్లి

సాదాబైనామా

క్రమబద్ధీకరించండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement