విద్య, వైద్యంపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యంపై దృష్టి సారించండి

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

కొడిమ్యాల: అధికారులు విద్య, వైద్యంపై దృష్టి సారించాలని ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌ అన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి సోమవారం పూడూరు జెడ్పి హైస్కూల్‌, కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యా ప్రమాణాలు, పిల్లల హాజరు, బోధన తీరును పరిశీలించారు. లక్ష్యంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, మందులు, సిబ్బంది పనితీరు, సౌకర్యాలు తెలుసుకున్నారు. డీపీవో మదన్‌ మోహన్‌, డీఈవో రాము, త హసీల్దార్‌ నరేశ్‌, ఎంపీడీవో స్వరూప, ఎంఈవో శ్రీనివాస్‌, సర్పంచులు గడ్డం జీవన్‌ రెడ్డి, కడారి మల్లేశం ఉన్నారు.

సర్వాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

మల్యాల: మండలంలోని సర్వాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను సిక్తాపట్నాయక్‌ పరిశీలించారు.నాణ్యతగా నిర్మించుకున్నారని లబ్ధిదారులను అభినందించా రు. ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రతి శాఖ లక్ష్యాలను నిర్ధేశించుకోవాలి

జగిత్యాల: వివిధ శాఖల అధికారులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని సిక్తా పట్నానాయక్‌ అన్నారు. 99 రోజుల కార్యాచరణ, ప్రణాళిక అమలు, పురోగతిపై కలెక్టర్‌తో కలిసి కలెక్టరేట్‌లో సమీ క్షించారు. ఆరోగ్యరంగంలో సాధించిన పురోగతి, గుర్తించిన కేసులు నివేదికలో కనిపించాలన్నారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని సూచించారు. విద్యాశాఖను పటిష్టం చేసేందుకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమీక్షించాలన్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఉపాధి నిధులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, కొత్త బస్టాప్‌లు, బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదనపు ఎస్పీ చేతన్‌ నితిన్‌, అదనపు కలెక్టర్‌ లత, డీపీఆర్వో రఘువరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement