జగిత్యాలరూరల్/రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం అర్పపల్లిలో రూ.19లక్షల ఉపాధి నిధులతో చేపట్టే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. తోట పుల్లవ్వ, రాజేశం ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం, ఉచిత బస్సు, ఇందరిమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల పంపిణీ, మహిళ సంఘాలకు రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సర్పంచ్ సొల్లు సురేందర్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
రూ.200 కోట్లతో రోడ్ల అభివృద్ధి
రాయికల్: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్ల మంజూరుకు సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. మండలం బషీర్‌పల్లిలో రూ.68 లక్షలతో చేపడుతున్న రోడ్డు పనులను పరిశీలించా రు. మండలానికి రూ.2.30కోట్లతో రోడ్లు మంజూరయ్యాయని, ఉప్పుమడుగు లింగాపూర్, దావన్‌పల్లి, కిష్టంపేట, జగిత్యాల, మూటపల్లి, కొత్తపేట డబుల్‌రోడ్, కొత్తపేట–లింగాపూర్ రోడ్డు, మూటపల్లి–కొత్తపేట డబుల్‌రోడ్, లింగాపూర్–తాట్లవాయి డబుల్‌రోడ్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. చింతలూరు, అల్లీపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. సర్పంచులు రమేశ్, తిరుపతి, ఎంబారి గౌతమి, వెంకట్‌రెడ్డి, మల్లేశం, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, మాజీ సర్పంచులు రాజు, అనుపురం శ్రీనివాస్, మోహన్‌రావు, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ముకీద్, నాయకులు పాల్గొన్నారు.


