పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

● హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్‌ ● మామూళ్లు మాట్లాడుకోవాలట.. ● ఇదీ..కోరుట్ల మున్సిపల్‌ తీరు ● ఇంటి నంబర్‌ వేయడానికి వసూళ్లు

జగిత్యాలజోన్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆధునిక పోకడల కారణంగా మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులతో గాలి, నీరు వంటి పంచ భూతాలు కలుషితం అవుతున్నాయన్నారు. ప్రకృతిని విచక్షణ రహితంగా కొల్లగొట్టడంతో పాటు అధికంగా ప్లాస్టిక్‌ వాడడం భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూరి సి.రత్న పద్మావతి మాట్లాడుతూ, మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సునీత రవీందర్‌రెడ్డి, సబ్‌ జడ్జి నాగేశ్వర్‌రావు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య, రెండో అ దనపు జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నిఖిషా, డీఎఫ్‌వో రవిప్రసాద్‌, ఎఫ్‌ఆర్‌వో పద్మారావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, జ్యూడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

రండి.. మాట్లాడుకోండి!

కోరుట్ల: కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ కొరివితో తలగోక్కున్నట్లే ఉంది. ఇంటి నిర్మాణం అనుమతి నుంచి మొదలుకుని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి నంబరు వరకు అడుగడుగునా అవస్థలు తప్పడం లేదు. ఇల్లు అనుమతికి ఫైళ్ల లెక్కన ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది.. ఇంటి నంబరు వేయాల్సిన సమయంలో కొలతలు తీసుకుని జాప్యం చేస్తున్నారు. ‘సార్‌ మా ఇంటి కొలతలు తీసుకున్నారు.. మరి ఆస్తి పన్ను ఎంత కట్టాలో చెబితే కట్టి ఇంటి నంబరు తీసుకుంటా మని అంటే.. అది కుదరదు.. మీరు వచ్చి సార్‌తో మాట్లాడుకోండి’.. అన్న సమాధానాలు రావ డం మున్సిపల్‌ ఉద్యోగులు ఆమ్యామ్యాల కో సం దిగజారుతున్న పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇంటి తీరును బట్టి రేటు

ఇంటి అనుమతుల సమయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఫైళ్ల లెక్కన కొంత, సెట్‌బ్యాక్‌ పేరిట మరికొంత, అనుమతికి విరుద్ధంగా డిజైన్‌ ఉందని ఇంకొంత అంతస్తులు లెక్కకట్టి డబ్బులు వసూలు చేయడం ఆనవాయితీగా మారినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఇదే తీరును మున్సిపల్‌ రెవెన్యూ సెక్షన్‌ ఉద్యోగులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటి విస్తీర్ణం కొలతలు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసి వెంటనే ఇంటికి నంబరు ఇవ్వాల్సిన ఉద్యోగులు సకాలంలో ఆ పని చేయడం లేదు. దీంతో ఇంటి నిర్మాణదారు తనకు ఇంటి నంబరు రావడం లేదని అధికారులను సంప్రదిస్తే ‘మీరు.. సార్‌తో మాట్లాడుకుంటే వెంటనే ఇంటి నంబరు వస్తుంది.’ అని చెబుతుండడం విడ్డూరం. ఇల్లును బట్టి కనీసం రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ఇంటి నంబరు వేయడం కోసం సిబ్బందికి చెల్లించాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి నానా అవస్థలు పడాల్సిన వస్తోంది.

పర్యవేక్షణ కరువు

కోరుట్ల మున్సిపాల్టీలో ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ కావడం, ఇన్‌చార్జి అధికారి పాలన సాగుతుండటంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. మున్సిపాల్టీలో సుమారు 20 వేల ఇళ్లు ఇదివరకే ఉండగా రోజూ 10 ఇళ్ల వరకు కొత్తగా నిర్మాణం పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రోజూ సదరు ఇళ్ల నిర్మాణదారుల నుంచి ఇంటి నంబరు కోసం రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఉద్యోగులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు మున్సిపల్‌ ఉద్యోగుల ఆమ్యామ్యాల తంతును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫిర్యాదులు వస్తే చర్యలు

ఇంటి నిర్మాణం కొలతలు తీసుకుని ఇంటి నంబర్లు ఉద్యోగులు వేస్తారు. కొత్త ఇంటి నంబర్లు వేయడానికి ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌,

మున్సిపల్‌ మేనేజర్‌, కోరుట్ల

Advertisement
 
Advertisement
Advertisement